బెంగళూరుకు చెందిన రేణు సక్సేనా అక్టోబరు నెలలో బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె నెలలు నిండక ముందే 36వ వారంలోనే బిడ్డను కన్నారు. బిడ్డ ఎంత బలహీనంగా ఉందో ఆమెకు అర్ధమయింది. ఆ శిశువు అతి చిన్న నరాలు పల్చని శరీరంలోంచి కనిపిస్తున్నాయి. శిశువు 2.4 కేజీల బరువుతో పుట్టింది. అయితే, ఆ చిన్నారికి వెంటనే మసాజ్ మొదలుపెట్టమని కుటుంబ సభ్యులు ఆమెకు సలహా ఇచ్చారు. కానీ, ఆమె డాక్టర్లు మాత్రం బిడ్డ బరువు పెరిగే వరకూ మసాజ్ మొదలుపెట్టవద్దని సూచించారు.

సక్సేనా ఒక రెండు వారాల వరకూ ఎదురు చూడాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ రెండు వారాల్లో బిడ్డ బరువేమీ చెప్పుకోదగినంత పెరగలేదు. సక్సేనా పసిపిల్లల సంరక్షణ చూసుకునే ఒక రిటైర్డ్ నర్సును బిడ్డ సంరక్షణ కోసం కుదుర్చుకున్నారు. ఆమె దగ్గర నుంచి పిల్లలకు మసాజ్ చేసే విధానాన్ని నేర్చుకున్నారు. మసాజ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచీ పరిస్థితులు మెరుగవ్వడం మొదలయింది. చిన్నారి పూర్తిగా నిద్రపోవడం మాత్రమే కాకుండా బరువు కూడా పెరిగింది.

దక్షిణాసియాలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు చేసే మసాజ్ వల్ల కూడా ప్రయోజనాలుంటాయని అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి. మసాజ్‌ను సరైన రీతిలో చేయడం ద్వారా బిడ్డ బరువు పెరగడం మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా ద్వారా సోకే ఇన్ఫెక్షన్‌లను కూడా నివారిస్తుందని, శిశు మరణాలను 50శాతం వరకు తగ్గిస్తుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, తమ పిల్లలకు మసాజ్ చేయాలని అనుకునే తల్లితండ్రులు ముందుగా తమ పిల్లలకు అది సురక్షితమో కాదో తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించడం మంచింది.

శాస్త్రీయ అధ్యయనాలు సంప్రదాయ పరిజ్ఞానాన్ని బలపరిచాయి. సక్సేనా అడ్వర్‌టైజింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసేవారు. ఆమె ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారు. ఈ రాష్ట్రంలో బాలింతలకు, పుట్టిన బిడ్డలకు కూడా పుట్టిన దగ్గర నుంచీ మసాజ్ చేసే సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. “మేము పుట్టిన తర్వాత మా అమ్మగారు త్వరగా ఎలా కోలుకున్నారో వివరిస్తూ ఉండేవారు. నాకు, నా తోబుట్టువులకు పుట్టిన వెంటనే మసాజ్ ఎలా మొదలుపెట్టారో చెప్పేవారు” అని సక్సేనా చెప్పారు.

సక్సేనా నియమించిన నర్సు, మసాజ్ కు వాడే తైలాలను ఎలా వేడి చేయాలో, కొబ్బరి నూనె, బాదం నూనెలను మార్చి మార్చి వాడే విధానం, రోజూ అరగంట సేపు వాటితో చిన్నారి శరీరాన్ని మర్దనా చేసే విధానాన్ని నేర్పించారు. మసాజ్ తర్వాత వేడి నీటితో స్నానం చేయించేవారు. “మేము ముందుగా సున్నితంగా, చిన్నారి పొట్టపై హృదయాకారంలో మృదువుగా స్ట్రోక్స్ ఇస్తూ నెమ్మదిగా శరీరంలోని ఇతర భాగాలను కూడా మర్దనా చేసేవాళ్ళం” అని చెప్పారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి