దక్షిణ భారతదేశంలో రైస్ ను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. రోజంతా ఏమి తిన్నా అన్నం తినకపోతే మాత్రం ఏదో లోటుగా కనిపిస్తోంది. అయితే రైస్ ఎక్కువ తింటే మధుమేహం వ్యాధి బారిన పడతారని అంటుంటారు. అయితే వెదురు బియ్యం తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

దక్షిణ భారతదేశంలో రైస్ ను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. రోజంతా ఏమి తిన్నా అన్నం తినకపోతే మాత్రం ఏదో లోటుగా కనిపిస్తోంది. అయితే రైస్ ఎక్కువ తింటే మధుమేహం వ్యాధి బారిన పడతారని అంటుంటారు. అయితే వెదురు బియ్యం తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. వెదురు బియ్యం చాలా అరుదైన బియ్యం రకం. ఇందులో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. చాలామందికి వైట్ రైస్ గురించి తెలుసు. అలాగే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అని రకరకాలు ఉన్నా, అవన్నీ వరి నుంచి వచ్చిన ధాన్యాలే. కానీ వెదురు రైస్ గురించి చాలామందికి తెలియదు. బాంబో చికెన్ అంటే వెదరు బొంగులో వండే చికెన్ ను బాంబో చికెన్ అంటారు. మరి వెదురు బియ్యం అంటే వెదురు బొంగుల్లో వండే రైస్ కాదు.

నేరుగా వెదురు చెట్టుకే పండే రైస్ ను వెదురు బియ్యం అంటారు. వెదురు బియ్యాన్ని ములయారి రైస్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వెదురు చెట్టు వయసు చివరి దశకు వచ్చి, అది చనిపోయేటపుడు కొత్త చెట్లు మొలకెత్తడానికి పెద్ద మొత్తంలో పుష్పించడం, విత్తనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. వెదురు కంకులు ఉద్భవిస్తాయి. ఈ వెదురు కంకులను కోసి తీస్తే అందులో విత్తనాలు బయటకు వస్తాయి, ఇలా తీసిన విత్తనాలనే వెదురు బియ్యం అంటారు. ఈ వెదురు బియ్యం చాలా అరుదుగా దొరుకుతాయి. వీటి ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెదురు చెట్టు జీవితకాలం ముగియటానికి కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అప్పటికి గానీ ఆ చెట్టు వెదురు కంకులను ఉత్పత్తి చేయదు. అందుకే వెదురు బియ్యం చాలా అరుదుగా దొరుకుతాయి.

వెదురు బియ్యం చూడటానికి మామూలు వరి నూకల బియ్యం లాగా ఉంటుంది. అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని మామూలు బియ్యంలాగే వండుకోవాలి. వండిన తర్వాత దాని ఆకృతిలో తేడా ఉంటుంది. ఈ బియ్యంతో వండిన అన్నం కొద్దిగా జిగటగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. రుచిలో గోధుమ ధాన్యాల రుచిని కలిగి ఉంటుంది, తియ్యగానూ ఉంటుంది. ఈ బియ్యంను కిచిడి చేయటానికి లేదా ఖీర్ చేయటానికి ఎక్కువుగా ఉపయోగిస్తారు.