Kolkata Knight Riders: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అంతగా కలసిరావడం లేదు. ఇప్పటికే జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేకేఆర్ జట్టుకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది.

ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అంతగా కలసిరావడం లేదు. ఇప్పటికే జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నితీష్ రాణాకు కెప్టెన్సీ దక్కింది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు కేకేఆర్ జట్టుకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. బంగ్లా వెటరన్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎల్-2023 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, షకీబ్ ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి అధికారికంగా తెలియజేశాడు. అంతర్జాతీయ కట్టుబాట్లు, వ్యక్తిగత విషయాలే ఇందుకు కారణమని షకీబ్ పేర్కొన్నాడు. కోల్‌కతా షకీబ్‌ని రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది. టీ20లో షకీబ్ నంబర్-1 ఆల్ రౌండర్‌గా నిలిచాడు.

టీమ్ గాడిన పడేనా?

కోల్‌కతా ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్‌ను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితిలో షకీబ్ కూడా తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. అయితే అతని సహచరుడు లిటన్ దాస్ కొన్ని రోజుల తర్వాత కోల్‌కతాలో చేరనున్నాడు. ఫ్రాంచైజీ అతనిని విడుదల చేసిందని గతంలో షకీబ్ గురించి వార్తలు వచ్చాయి. అయితే షకీబ్ స్వయంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నిబంధనల ప్రకారం, వేలంలో కొనుగోలు చేసిన తర్వాత ఏ ఫ్రాంచైజీ కూడా ఆటగాడిని విడుదల చేయదు. సీజన్ ముగిసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయగలదు. షకీబ్ తన బ్యాట్‌తో పాటు అద్భుతమైన స్పిన్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల శక్తి కలిగి ఉన్నాడు.