టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్‌ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడంటే చాలు ఆయన ఫ్యాన్స్‌ హంగామా చేస్తుంటారు. ఇక విరాట్ అభిమానులు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. దేశాలతో సంబంధం లేకుండా ఆయన ఆటతీరుకు…

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్‌ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడంటే చాలు ఆయన ఫ్యాన్స్‌ హంగామా చేస్తుంటారు. ఇక విరాట్ అభిమానులు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. దేశాలతో సంబంధం లేకుండా ఆయన ఆటతీరుకు అభిమానులు ఉన్నారు. ఇతర దేశాల టీమ్‌ సభ్యులు కూడా విరాట్‌ను అభిమానిస్తుంటారు. చాలా మంది ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు చూశే ఉంటాం.

ఇదిలా ఉంటే తాజాగా దాయాది దేశం పాకిస్థాన్‌లో ఓ క్రికెట్ అభిమాని సైతం విరాట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మ్యాచ్‌ స్టేడియంలో ప్లకార్డ్‌ రూపంలో తన కోరికను ప్రకటించాడు. వివరాల్లోకి వెలితే.. తాజాగా ఇంగ్లండ్‌, పాక్‌ల మధ్య టీ20 మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయాన్ని సాధించింది. పాకిస్థాన్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగానే ఓ క్రికెట్ అభిమాని ప్లకార్డ్‌పై.. ‘కోహ్లి నువ్వు రిటైర్‌ అయ్యేకంటే మందే పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడు’ అని రాశాడు. దీంతో ఈ ప్లకార్డ్‌ కెమెరా కంట చిక్కడంతో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే విరాట్‌ ఇప్పటికే మొత్తం 102 టెస్టులు, 262 వన్డేలు, 108 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. విదేశాల్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ పాకిస్థాన్‌లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. పాకిస్థాన్లో చివరిసారి 2006లో భారత్‌ టూర్‌ జరిగింది. అయితే ఆ సమయంలో విరాట్‌ టీమిండియాలో లేడు. 2006 తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో కోహ్లి పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ ఆడని జాబితాలో చేరాడు.