విపరీతంగా పెరుగుతున్న మంకీపాక్స్‌ కేసులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది..మన దేశంలో కరోనా తగ్గుతూ వస్తుంటే యూరప్‌ అంతటా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు 70వేల మార్క్‌ను దాటాయని WHO తెలిపింది.రానున్న రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా జాగ్రత్తలు తీసుకోవడం ఆపొద్దని సూచించింది. గతవారం మంకీపాక్స్‌ కేసులు పెరిగిన దేశాల్లో.. అమెరికా కాంటినెంట్‌ దేశాలున్నాయి. WHO చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసన్‌ సైతం హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఇది ఈ అంటువ్యాధికి అత్యంత ప్రమాదకరమైన సమయం కావచ్చు అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గముఖం పడుతుండగా.. గతవారం 21 దేశాల్లో కేసులు పెరిగాయని తెలిపారు. అమెరికా ఖండంలోని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో 90శాతం గుర్తించారు. మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టే సమయం ముగియలేదని.. అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తోందని టెడ్రోస్‌ అన్నారు. తగ్గే సమయం ప్రమాదకరమని.. ఎందుకంటే ఈ సమయంలో వైరస్‌ తగ్గిందని భావించి జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తామని.. దీంతో మళ్లీ పెరిగే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 70 వేలకుపైగా కేసులు నమోదయ్యాయని.. ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు.

పరీక్షల సామర్థ్యం పెంచడంతోపాటు నిఘా వ్యవస్థను మెరుగుపరిచేందుకు WHO కృషి చేస్తుందని చెప్పారు.దేశంలో క‌రోనా కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంది..కానీ యూరప్‌ అంతటా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.దీన్ని WHO, యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ బోర్డు ధ్రువీకరించింది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.మరో వేవ్‌ వస్తుందనటానికి ఇది నిదర్శనం’ అని WHO యూరప్‌ డైరెక్టర్‌ హాన్స్‌ ఖ్లూజ్‌ తెలిపారు.చైనాలోనూ కరోనా కేసులు విజృంభిస్తోంది.దీంతో ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.