హత్య కేసులో ఓ భారతీయుడిని దోషిగా తేల్చింది బ్రిటన్ కోర్టు. ఉమ్మి వేశాడన్న ఆక్రోశంతో కత్తితో పొడిచి చంపాడని.. గుర్జీత్ సింగ్ లాల్(36) అనే భారత వ్యక్తిని బ్రిటన్ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది.

హత్య కేసులో ఓ భారతీయుడిని దోషిగా తేల్చింది బ్రిటన్ కోర్టు. ఉమ్మి వేశాడన్న ఆక్రోశంతో కత్తితో పొడిచి చంపాడని.. గుర్జీత్ సింగ్ లాల్(36) అనే భారత వ్యక్తిని బ్రిటన్ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. డిసెంబర్ 14న శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.

వివరాల్లోకి వెళ్తే… గతేడాది ఆగస్టు 24న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సెయింట్ మెరీస్ అవెన్యూ సౌత్‌లో గల తన ఇంటి నుంచి మాజీ రగ్బీ ఆటగాడైన అలన్ ఇసిచీ(69) పబ్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చాడు. అదే సమయంలో గుర్జీత్ సింగ్ తన ఇంటివైపు రావడం చూసిన అలన్… ఉమ్మివేయడం గమనించాడు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇదే క్రమంలో గుర్జీత్ తన వద్ద ఉన్న కత్తితో అలన్‌పై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు కత్తితో అతిదారుణంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అలన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న అలన్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు రక్తపు మరకల గుర్తుల ఆధారంగా గుర్జీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుర్జీత్‌ను రిమాండ్ కు తరలించింది కోర్టు. ఈ కేసు సోమవారం లండన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో గుర్జీత్ ఆత్మరక్షణలో భాగంగానే తాను అలన్‌పై దాడి చేసినట్లు విన్నవించుకున్నాడు. కానీ, అలన్ మృతికి గుర్జీతే కారణమని తేలడంతో న్యాయస్థానం అతడ్ని దోషిగా నిర్ధారించింది. డిసెంబర్ 14న అతడికి శిక్షను ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి