పిల్లల్లో ఎదుగుదల, జీవ క్రియలు సక్రమంగా జరగడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. కణ విభజన, కొత్త కణాలు తయారీ, కండరాల్లో బలం, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఇవి ఆహారంలో ఉండాలి.

CHILDREN FOOD : ఎదుగుతున్న పిల్లల అహారం విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించటం మంచిది. ఎందుకంటే తీసుకునే ఆహారం వారి ఎదుగుదలలో ఎంతగానో సహాయపడుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలోనే కాకుండా వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరేందుకు అవకాశం ఉండదు. తద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు అందించాల్సిన ఆహారం విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

విటమిన్‌ సీ ; విటమిన్‌ సీ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి, వాటితో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్‌ సీ వల్ల పిల్లలు ఆడుకునేటపుడు గాయపడితే, వాటిని త్వరగా నయం అవుతాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి విటమిన్‌ సీ పండ్ల రసాలు పిల్లల ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. జామ, బొప్పాయి, టమాట వంటి కూరగాయలు పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. విటమిన్‌ డీ ; పిల్లలకు విటమిన్‌ డీ పొందడానికి సూర్యకాంతి మంచిది. వారిని సూర్యకాంతిలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఇంటి బాల్కనీ, టెర్రస్‌పై ఆడుకోనివ్వాలి. ఎముకలు దృఢంగా, ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ విటమిన్‌ అవసరం.

ప్రొటీన్లు; పిల్లల్లో ఎదుగుదల, జీవ క్రియలు సక్రమంగా జరగడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. కణ విభజన, కొత్త కణాలు తయారీ, కండరాల్లో బలం, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఇవి ఆహారంలో ఉండాలి. చర్మం, ఎముకలు, గోళ్ల ఆరోగ్యంలో ప్రొటీన్లు కీలకంగా చెప్పవచ్చు. చిక్కుడు, శనగలు, ఆకుకూరలు, గింజధాన్యాలు, విత్తనాలు, గోధుమ, బ్రౌన్‌రైస్‌, మొలకెత్తిన గింజలు, కూరగాయలు, మొక్కజొన్న, బంగాళాదుంప, బ్రకోలీ, గుడ్డు మంచిది. పాల ఉత్పత్తులూ తప్పనిసరిగా అందించాలి.

విటమిన్లు, ఖనిజలవణాలు; ఎముకల ఎదుగుదలకు కాల్షియం తప్పనిసరి. ఆకుకూరలు, బాదం, చియా విత్తనాలు, నువ్వులు వంటివి ఇవ్వాలి. అలాగే ఐరన్‌ రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచి, ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను అవయవాలన్నింటికీ సక్రమంగా చేరేలా చేస్తుంది. గుమ్మడి, బాదం, జీడిపప్పు, ఆకుకూరలు, ఓట్స్‌, ఎండుద్రాక్ష వంటివి మంచివి. ఏ,సీ,డీ, ఈ,కే విటమిన్లుండే ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్లవారీ వచ్చే పండ్లను తినిపించాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి